: స్వీయ తప్పిదంతో రన్ అవుట్ అయిన రాహుల్... సీరియస్ గా చూసిన రవిశాస్త్రి!

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ విరామం తరువాత భారత ఆటగాడు కేఎస్ రాహుల్ అనవసరంగా అవుట్ అయ్యాడు. రాహుల్ కొట్టిన షాట్ మిడాన్ లోకి వెళ్లగా, లేని పరుగుకు ప్రయత్నించగా, అవతలి ఎండ్ లోని పుజారా, రెండడుగులు ముందుకేసిన తరువాత రన్ అవుట్ ప్రమాదాన్ని పసిగట్టి వారించాడు. ఈలోగా పిచ్ మధ్యలోకి వచ్చిన రాహుల్, వెనక్కు వెళ్లాలా? వద్దా? అన్న మీమాంసలో రెండు సెకన్లు ఉండిపోగా, ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బంతిని అందుకున్న చండిమల్, దాన్ని కీపర్ డిక్ వెల్లాకు అందించగా, అతను బెయిల్స్ పడగొట్టాడు. ఈ మొత్తం సీన్ నూ పెవీలియన్ నుంచి చూస్తున్న రవిశాస్త్రి, కాస్తంత సీరియస్ అయినట్టు కనిపిస్తోంది. 82 బంతులాడిన రాహుల్ 7 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో నిష్క్రమించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి పుజారాకు జత కలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 109 పరుగులు.

More Telugu News