mahesh: 'లై' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మహేశ్ బాబు!

హను రాఘవపూడి చేసింది రెండు సినిమాలే అయినా, దర్శకుడిగా ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేశాడు. "దర్శకుడు హను  రాఘవపూడినా? .. అయితే చూడొచ్చు .." అని యూత్ అనుకునేలా ఆయన చేయగలిగాడు. అలాంటి హను రాఘవపూడి తాజా చిత్రంగా ఈ నెల 11వ తేదీన 'లై' ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరపాలని 14 రీల్స్ సంస్థ వారు నిర్ణయించుకున్నారు. ఈ ఫంక్షన్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ కావడం కోసం, మహేశ్ బాబును ముఖ్య అతిథిగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేశారట. 14 రీల్స్ వారితో మహేశ్ బాబుకి మంచి అనుబంధం వుంది. అందువలన ఆయన తప్పకుండా రావొచ్చని అనుకుంటున్నారు. తనకి ఫలానా రోజున వీలవుతుందని  మహేశ్ చెబితే, ఆ రోజున ఫంక్షన్ పెట్టుకోవడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారట. ప్రీ రిలీజ్ డేట్ ఫంక్షన్ ఇప్పుడు మహేశ్ చేతిలో ఉందన్న మాట.

More Telugu News