: ఉగ్రవాది మృతదేహాన్ని తీసుకునేందుకు నిరాకరించిన పాకిస్థాన్!

పవిత్ర యుద్ధం పేరుతో ఉగ్రవాదులుగా మారేవారు కుక్కచావు చస్తారనే విషయాన్ని పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. పాక్ నుంచి భారత కశ్మీర్ లో కల్లోలం రేపేందుకు వచ్చిన లష్కరే తాయిబా చీఫ్‌ కమాండర్‌ అబూ దుజాన మృతదేహం తమకు అక్కర్లేదని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. పుల్వామా జిల్లాలో భార్యతో గడిపేందుకు వచ్చిన దుజానాను భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం అతని మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ జమ్ముకశ్మీర్‌ పోలీసులు పాక్‌ హైకమిషన్‌కు లేఖ రాశారు.

అయితే దానిని పాక్‌ అధికారులు తిరస్కరించారు. అతని మృతదేహాన్ని తీసుకుంటే, అతను పాకిస్థానీ అని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేది పాకిస్థానే అని ప్రపంచ దేశాలకు స్పష్టంగా నిర్ధారణ అవుతుంది. అలా జరగకుండా జాగ్రత్త పడడంలో భాగంగా పాక్ అతని మృతదేహం తీసుకునేందుకు నిరాకరించింది. ఇక, అతని స్థానంలో కొత్త కమాండర్ ను నిర్మించేందుకు లష్కరే వర్గాలు సన్నాహాలు చేపట్టినట్టు తెలుస్తోంది. కొత్త చీఫ్ కమాండర్ గా బాధ్యతలను అమర్ నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడిన మహ్మద్‌ అబూ ఇస్మాయిల్‌ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

More Telugu News