: స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్‌ను మూసేయాలని గాంధీ చెప్పారు.. ఇప్పుడు మరో గాంధీ ఆ పని చేస్తున్నారు..: రాహుల్‌పై అమిత్ షా విసుర్లు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రోహ్‌తక్‌లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మూసేయాలని మహాత్మాగాంధీ కోరారని, అయితే ఇప్పుడా పనిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు.

బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసించిన ఆయన వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని, దేశాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిందని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా అభివృద్ధి రేటు గణనీయంగా పడిపోయిందని అన్నారు. మళ్లీ ఈ ప్రాంతం (హరియాణా)లో బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కుతుందని పేర్కొన్నారు.

More Telugu News