: బ్రిటన్ దినపత్రిక టెలిగ్రాఫ్ అతిపెద్ద పొరపాటు.. ప్రిన్స్ ఫిలిప్ చనిపోయినట్టు ప్రకటన!

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక టెలిగ్రాఫ్ అతి పెద్ద పొరపాటు చేసింది. ఫ్రిన్స్ ఫిలిప్ మరణించినట్టు ప్రకటించింది. రాచరికపు విధుల నుంచి ఆయన రిటైరైన రోజే ఫిలిప్ మృతి చెందినట్టు పేర్కొని సంచలనం సృష్టించింది. ఈ మేరకు సంపూర్ణంగా లేని ఆర్టికల్‌ను తన వెబ్‌సైట్‌లో పెట్టింది.

‘‘హోల్డ్ హోల్డ్ హోల్డ్ ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ డైస్ ఏజ్ XX’’ అంటూ పేర్కొంది. డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ అయిన ప్రిన్స్ ఫిలిప్ బ్రిటిష్ చరిత్రలోనే సుదీర్ఘకాలం రాజుగా ఉన్నారని, ఆయన 20 ఏళ్ల వయసులో మృతి చెందినట్టు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ ప్రకటించింది’’ అంటూ అసంపూర్ణమైన, అసంబద్ధమైన అర్థంతో పేర్కొంది. తన బలం ఆయనేనని రాణి కూడా చెప్పేవారని ఆ వార్తలో పేర్కొనడం గమనార్హం. అయితే తప్పును తెలుసుకున్న వెంటనే టెలిగ్రాఫ్ యాజమాన్యం క్షమాపణలు చెప్పి వెబ్‌సైట్ నుంచి వార్తను తొలగించింది.

More Telugu News