: ఉత్తరకొరియా వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించిన అమెరికా!

ఉత్తరకొరియా సందర్శనను అమెరికా పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో సెప్టెంబరు 1 నుంచి అమెరికన్లెవరూ ఉత్తరకొరియాలో అడుగుపెట్టకూడదని పేర్కొన్నారు. ఆ దేశంలో అడుగుపెట్టిన అమెరికన్లు అరెస్ట్ అయి ఎక్కువ కాలం జైళ్లలో ఉండిపోవాల్సి వస్తోందని, జైళ్లలో అమెరికన్లకు భద్రత లేదని పేర్కొన్నారు. ఇందులో కేవలం మీడియా ప్రతినిధులకు మాత్రం మినహాయింపునిస్తున్నట్టు తెలిపారు.

ఏడాదిపాటు ఉత్తరకొరియా ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తరకొరియాలో పర్యటించేందుకు వెళ్లిన అమెరికన్ విద్యార్థి వాంబియర్ ఓట్టో (22) ను అరెస్టు చేసి, 18 నెలలు జైల్లో ఉంచారు. జైలు నుంచి విడుదలైన వారం రోజులకే అతను ప్రాణాలు విడిచాడు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

More Telugu News