: ఒకేరోజు రెండు రోడ్డు ప్ర‌మాదాలు... తృటిలో త‌ప్పించుకున్న కుటుంబం... వీడియో చూడండి

చైనాలోని జియామెన్ మెయిన్‌రోడ్ మీద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. మెకానిక్‌ కోసం ఓ కారు డ్రైవ‌ర్ ప‌క్క‌నే ఉన్న న‌గ‌రానికి వెళ్లాడు. ఆ కారులో వ‌చ్చిన కుటుంబానికి ఏం చేయాలో తెలియ‌క‌ రోడ్డు డివైడ‌ర్ మీద కాసేపు ఎదురుచూశారు. త‌ర్వాత పిల్ల‌లు ఏడుస్తుండ‌టంతో వాళ్లిద్ద‌రినీ ఎత్తుకుని రోడ్డు దాటుతుండ‌గా వేగంగా వ‌స్తున్న కారు వీళ్ల‌ని ఢీకొట్టబోయింది. వారు తృటిలో త‌ప్పించుకున్నారు.

దీంతో వేగంగా వ‌చ్చిన కారు, ఇంత‌కు ముందు యాక్సిడెంట్ అయిన వాళ్ల కారును మ‌రోసారి ఢీకొట్టింది. వాళ్లు తృటిలో త‌ప్పించుకున్న దృశ్యాలు వీడియో ఇంట‌ర్నెట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఒకేరోజు రెండు రోడ్డు ప్ర‌మాదాల నుంచి తృటిలో త‌ప్పించుకున్న ఈ కుటుంబం ఎంతో అదృష్టవంతుల‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News