: వైజాగ్ లో వన్డే... హైదరాబాదులో టీ20... మూడు సిరీస్ ల షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

స్వదేశంలో టీమిండియా ఆడనున్న సుదీర్ఘ షెడ్యుల్ ను బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబరు నుంచి డిసెంబరు ఆఖరి వరకు టీమిండియా స్వదేశంలో 23 అంతర్జాతీయ మ్యాచ్‌ లు ఆడనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తో వన్డే, టీ20 సిరీస్‌ లు ఆడనున్న టీమిండియా, శ్రీలంకతో మాత్రం మూడేసి టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ సిరీస్ లకు ఆతిథ్యమివ్వనున్న వేదికలను కూడా బీసీసీఐ ఖరారు చేసింది. ఆసీస్ సిరీస్ సందర్భంగా ఒక టీ20 మ్యాచ్ కు హైదరాబాదు ఆతిథ్యమివ్వనుండగా, శ్రీలంకతో ఆడనున్న వన్డేకు విశాఖపట్టణం ఆతిథ్యమివ్వనుంది.

ఆస్ట్రేలియాతో టీమిండియా 5 వన్డేలు ఆడనుండగా, వాటికి చెన్నై, బెంగళూరు, నాగ్‌ పూర్‌, ఇండోర్‌, కోల్‌ కతాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అలాగే మూడు టీ20లకు హైదరాబాద్‌, రాంచి, గువహాటిలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక న్యూజిలాండ్ తో మూడు వన్డేలు పుణె, ముంబై, కాన్పూర్‌ వేదికగా ఆడనుంది. అలాగే మూడు టీ20ల మ్యాచ్ లు ఢిల్లీ, కటక్‌, రాజ్‌ కోట్‌ వేదికగా ఆడనుంది. శ్రీలంతో జరగనున్న సిరీస్ లో కోల్‌ కతా, నాగ్‌ పూర్‌, ఢిల్లీలలో టెస్టు మ్యాచ్ లు, ధర్మశాల, మొహాలి, వైజాగ్‌ లలో మూడు వన్డేలు, మూడు టీ20లను కోచి/తిరువనంతపురం, ఇండోర్‌, ముంబైలలో ఆడనుంది. 

More Telugu News