: భాగ్యనగరంలో అదృశ్యమైన ‘డబుల్ డెక్కర్లు’.. బెంగళూరులో సందడి చేసేందుకు రెడీ!

డబుల్ డెక్కర్ బస్సులు.. నిన్నమొన్నటి వరకు భాగ్యనగరవాసులకు మధురానుభూతులు పంచిన ఇవి వివిధ  కారణాలతో కనుమరుగయ్యాయి. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పర్యాటకులకు వీటిపై సవారీ చేయకుండా టూర్ ముగిసేది కాదు. అయితే అవి క్రమంగా తెల్లఏనుగుల్లా మారడంతో ప్రభుత్వం వాటిని సర్వీసుల నుంచి తొలగించింది.

ఇప్పుడు ఇవే బస్సులను బెంగళూరులో తిరిగి ప్రారంభించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. బెంగళూరువాసులకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిన వీటిని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా పర్యాటకానికి ఊపు తేవాలని భావిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) యోచిస్తోంది. ఇందులో భాగంగా  నాలుగై దు బస్సులను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ‘బెంగళూరు దర్శన్’ పేరుతో తిరిగిన ఒక్కే ఒక్క డబుల్ డెక్కర్ బస్సు 2014 వరకు సేవలందించింది. అయితే ఆ తర్వాత మూలనపడింది. తాజాగా డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్న కార్పొరేషన్ వాటిని టూరిస్టులకే పరిమితం చేస్తుందా? లేక సాధారణ సర్వీసులకూ ఉపయోగిస్తుందా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News