: అమెరికాను మళ్లీ భయపెడుతున్న ఉత్తరకొరియా!

యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి అమెరికాను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇంతవరకు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ (ఖండాంతర క్షిపణుల) ను పరీక్షించడం ద్వారా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన ఉత్తర కొరియా, ఇప్పుడు ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా సబ్ మెరైన్ మిసైల్ లాంఛ్ సిస్టమ్ ను పరీక్షిస్తోందని అమెరికా గుర్తించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తర కొరియా సబ్‌ మెరైన్ వ్యవస్థలో కదలికలు మొదలయ్యాయని అమెరికా రక్షణశాఖ అధికారి తెలిపారు.

జూలై నెలలో మూడు క్షిపణులను సబ్‌ మెరైన్ ద్వారా పరీక్షించారని ఆయన చెప్పారు. గత ఆదివారం సిప్నో నావల్ షిప్‌ యార్డ్‌ లో ఒక క్షిపణిని పరిక్షించిన సమాచారం ఉందని ఆయన చెప్పారు. గ్యాస్ ఒత్తిడిని ఉపయోగించి క్షిపణులను ప్రయోగిస్తున్నారని, సబ్‌ మెరైన్ మిసైల్ లాంచ్ సిస్టమ్‌ ను అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు భూమిపై లక్ష్యాలను మాత్రమే చేరుకునేలా అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఉత్తరకొరియా అమెరికా నేవీని కూడా లక్ష్యంగా చేసుకుందని తాజా ప్రకటన తెలుపుతోంది. కిమ్ జింగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఒక్కో శస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారని అర్థమవుతోంది. 

More Telugu News