Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

*  అటు పెద్ద హీరోలతోనే కాకుండా, ఇటు కుర్ర హీరోలతో కూడా నటిస్తూ అందాల త్రిష తమిళంలో బిజీగా వుంది. ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో విజయ్ సేతుపతితో కలసి '96' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పాండిచ్చేరిలో జరుగుతోంది.  
*  'ఓకే బంగారం' సినిమాతో పేరు తెచ్చుకున్న దుల్ఖర్ సల్మాన్ హీరోగా నటించిన 'కలి' మలయాళ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. సమీర్ తాహిర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటించింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం టైటిల్ని త్వరలో ప్రకటిస్తారు.
*  అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'డీజే' చిత్రాన్ని అదే పేరుతో మలయాళంలోకి డబ్ చేశారు. దీనిని ఈ నెల 11న కేరళలో రిలీజ్ చేస్తున్నారు. బన్నీకి మలయాళంలో మంచి క్రేజ్ ఉండడంతో ఈ చిత్రం పట్ల అక్కడ మంచి అంచనాలు వున్నాయి.
*  'పెళ్లి చూపులు' ఫేం విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా లావణ్య త్రిపాఠీని తీసుకున్నారు.  

More Telugu News