: ముగిసిన సిట్ విచారణ.. మీడియా పాయింట్ ఎత్తివేత.. బోసిపోయిన ఆబ్కారీ భవన్!

మంగళవారం మధ్యాహ్నం వరకు ఆబ్కారీ భవన్ కళకళలాడింది. మీడియా పాయింట్ వద్ద విలేకరుల సందడి.. మరోవైపు విచారణకు వస్తున్న సినీ ప్రముఖులను చూసేందుకు వచ్చిన అభిమానులతో కళకళలాడుతూ ఉండేది. ఎప్పుడూ చూసినా ఒకటే సందడి.. అలాంటిది మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా బోసిపోయింది. నటుడు నందు విచారణతో తొలి దశ విచారణను సిట్ ముగించింది.

డ్రగ్స్ కేసులో కెల్విన్, జిషాన్‌ల అరెస్ట్ తర్వాత ఇప్పటి వరకు 42 మందిని అధికారులు విచారించారు. వీరిలో 12 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్ తదితరుల నుంచి పరీక్షల కోసం గోళ్లు, తల వెంట్రుకలు, రక్తం నమూనాలను కూడా సేకరించారు. త్వరలోనే చార్జిషీట్‌కు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు.

కాగా, నందుతో తొలి దశ విచారణను ముగించిన అధికారులు మంగళవారం ఆబ్కారీ భవనానికి తాళాలు వేశారు. మీడియా పాయింట్‌ను ఎత్తివేశారు. రిసెప్షన్ మరోవైపు ఉందంటూ బాణం గుర్తు కలిగిన బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సందడిలేక కళావిహీనమైంది.

More Telugu News