: డ్రగ్స్ కేసులో ముగిసిన సిట్ విచారణ.. మలి దశలో విచారించేది వీరినే...!

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందికి నోటీసులు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారంతో తొలి దశ విచారణను ముగించింది. ఇప్పుడిక సిట్ ఏం చేస్తుంది? విచారణ ఇంకా కొనసాగిస్తుందా? మళ్లీ విచారణ జరిపితే ఎవరిని పిలుస్తుంది? ఆ విచారణ ఎలా ఉండబోతోంది? తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిట్ తదుపరి విచారణ రహస్యంగా సాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పది ఐటీ కంపెనీలకు నోటీసులిచ్చిన సిట్ అధికారులు రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ కార్యరంగంలోకి దిగనున్నట్టు సమాచారం.

ఇక ఈసారి విచారణ భిన్నంగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మూడో దశలో బడాబాబుల పిల్లలు, పెట్టుబడిదారులు, రియల్టర్లు, సినీ ఫైనాన్షియర్ల పిల్లలను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 21 మందిని గుర్తించారు. సిట్ అధికారులు గుర్తించిన ఐటీ ఉద్యోగుల్లో కొందరు ఒత్తిడిని అధిగమించేందుకు, మరికొందరు పెద్దమొత్తంలో వస్తున్న వేతనాలను ఏం చేయాలో తెలియక అలవాటుగా డ్రగ్స్ వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. విచారణ సమయంలో కంపెనీ ప్రతినిధులను కూడా పిలవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. అయితే ఈ విచారణ రహస్యంగా జరపాలా? లేక ఇప్పటి వరకు జరిపినట్టుగానే జరపాలా?  అన్న విషయంలో అధికారులు సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News