allu arjun: బన్నీతో సినిమా కేన్సిల్ కాలేదంటోన్న తమిళ డైరెక్టర్!

కోలీవుడ్లో లో మంచి పేరున్న దర్శకులలో లింగుస్వామి ఒకరు. ఆ మధ్య ఆయన అల్లు అర్జున్ కి ఒక కథ వినిపించాడనీ, ఆయనతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించాడనే వార్తలు వచ్చాయి. ఈ సినిమా 'దువ్వాడ జగన్నాథం' కంటే ముందే వుండాల్సింది .. కానీ అలా జరగలేదు. ఆ తరువాత కూడా బన్నీ .. వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చాడు.

దాంతో ఇక లింగుస్వామితో బన్నీ సినిమా లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఓ తమిళ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన లింగుస్వామి, అల్లు అర్జున్ తో తన సినిమా ఆగిపోలేదని చెప్పాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అన్నాడు. ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోందనీ .. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు.  

More Telugu News