mahesh babu: కోలీవుడ్ స్టార్ హీరోల రికార్డులను దాటేసిన మహేశ్ బాబు!

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో దర్శకుడిగా మురుగదాస్ కి ఎంతో ఇమేజ్ వుంది. దాంతో మురుగదాస్ తన తాజా చిత్రం 'స్పైడర్'ను ఈ మూడు భాషల్లో విడుదల చేయనున్నాడు. తమిళ .. హిందీ భాషల్లో మరింత క్రేజ్ ను పొందడానికి .. అక్కడ తన మార్కెట్ ను విస్తరించుకోవాలనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఈ సినిమా చేశాడు.

కోలీవుడ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టు చెన్నై సమాచారం. అజిత్ .. విజయ్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లకి మించి ఈ సినిమా 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు చెబుతున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వస్తుండటమే ఇందుకు కారణమని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ వుంది. అది పూర్తి చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.      

More Telugu News