: ఉత్తరకొరియా సంగతి మేం చూసుకుంటాం: డొనాల్డ్ ట్రంప్

ఉత్తరకొరియా సంగతి తాము చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరకొరియాను నియంత్రించే శక్తి సామర్థ్యాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. అందుకు తగ్గ ప్రణాళికలను మాత్రం వివరించేందుకు ఆయన నిరాకరించారు. ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. కాగా, గత నెలలో ఉత్తరకొరియా రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ రెండు పరీక్షలు విజయవంతమయ్యాయని, అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగల శక్తి తమకు వచ్చిందని ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఉత్తరకొరియాను నియంత్రించేందుకు చైనా ఏమాత్రం సాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు. 

More Telugu News