: 'గర్భవతుడి'గా పుట్టిన బాబు... అత్యంత అరుదైన కేసంటున్న ముంబై డాక్టర్లు!

భారత వైద్య చరిత్రలో ఇది అత్యంత అరుదైన కేసు. ఇండియాలో ఏంటి? ప్రపంచంలోనే ఇటువంటి కేసులు ఇప్పటివరకూ ఓ 200 మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ముంబై బిర్లా ఆసుపత్రిలో ముంబ్రా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి పురుడు పోసుకోగా, పూర్తి ఆరోగ్యంతో పండంటి బాబు జన్మించాడు. రొటీన్ గా అతన్ని స్కాన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయే విషయాన్ని కనుగొన్నారు.

అతని కడుపులో మరో బాబు ఉండటమే ఇందుకు కారణం. 7 సెంటీమీటర్ల పొడవుతో, తల, కాళ్లు, చేతులు అభివృద్ధి చెందిన స్థితిలో మరో చిన్నారి పిండాన్ని కనుగొన్నారు. బిడ్డ పుట్టిన తొమ్మిదో రోజున విషయం తెలుసుకున్న వైద్యులు, విజయవంతంగా శస్త్రచికిత్సను చేసి ఆ పిండాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ బిడ్డ, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని, చిన్నారి గర్భవతుడి కడుపు నుంచి 150 గ్రాముల బరువున్న పిండాన్ని వెలికితీశామని తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసని తెలిపారు.

More Telugu News