: ఇది శ్వేత నాగు కాదు... సాల్టీ గ్రే స్నేక్!

ఆస్ట్రేలియాలో కనిపించిన ఒక పామును చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ధవళవర్ణంలో ధగధగా మెరిసిపోతున్న ఆ పామును చూస్తే ఎవరైనా శ్వేతనాగు అని భ్రమించాల్సిందే. అయితే, అది సాల్టీ గ్రే స్నేక్ అని పరిశోధకులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ సాల్టీ గ్రే స్నేక్స్ ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటికి విషం ఉండదు. అందుకే, ఇవి కరిచినా ఏమీ కాదు. అయితే అరుదైన జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఇది ఇలా శ్వేతవర్ణంలో పుడుతుందని వారు చెబుతున్నారు.

కొంత మంది దీనికి పాండు రోగం వచ్చిందని పేర్కొంటున్నారని... దీనికి అలాంటిదేమీ లేదని, ఎందుకంటే పాండు రోగం వస్తే దీని కళ్లు గులాబీ వర్ణంలోకి మారాలని, అలా మారలేదని, దీని కళ్లు నలుపు రంగులో ఉన్నాయని వారు చెప్పారు. ఇది జన్మతః ఈ లక్షణాలతోనే పుట్టిందని వైల్డ్ లైఫ్ పార్క్ టెరిటరీ సిబ్బంది చెబుతున్నారు. ఈ అరుదైన పాము పరిరక్షణ వారే చూస్తున్నారు. దీనిని కుక్క తినబోతే స్థానికుడు దీనిని రక్షించి ఇచ్చారని వారు తెలిపారు.

More Telugu News