raviteja: 'టచ్ చేసి చూడు'ను రవితేజ హోల్డ్ లో పెట్టేశాడా?

రవితేజ ఒకేసారి 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' సినిమాలను పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాల్లో 'రాజా ది గ్రేట్' 70 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుని, రిలీజ్ డేట్ ను కూడా ఖాయం చేసుకుంది. అక్టోబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విక్రమ్ సిరి దర్శకత్వంలో ఈ సినిమాతో పాటే మొదలైన 'టచ్ చేసి చూడు' చాలా రోజుల క్రితమే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాల్లో రవితేజ అసంతృప్తికి లోనై, ఆ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టేశాడని చెప్పుకుంటున్నారు. ఆ సినిమాకి సంబంధించిన వివరాలేవీ బయటికి రాకపోతుండటంతో, ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. మరి 'రాజా ది గ్రేట్' పూర్తయిన తరువాతనైనా ఆయన ఆ ప్రాజెక్టును మళ్లీ టచ్ చేస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.   

More Telugu News