rana: 'నేనే రాజు నేనే మంత్రి' క్లైమాక్స్ కోసం చాలా ధైర్యం చేశారట!

బలమైన కథా కథనాలతో తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాను సిద్ధం చేస్తున్నాడు. రానా లుక్ ఈ సినిమాపై కొంత ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ మరింత ఆసక్తిని పెంచడంలో తోడ్పడింది. మొత్తానికి ఈ సినిమా కొత్తగా ఉండబోతోందనే విషయం ఆడియన్స్ లోకి వెళ్లింది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో .. ఈ సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా వుండనుందనే టాక్ వినిపిస్తోంది. తేజ .. రానా కలిసి క్లైమాక్స్ ను చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నారని అంటున్నారు. ఈ క్లైమాక్స్  ఓ ప్రయోగం లాంటిదనీ .. ఈ క్లైమాక్స్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడమనేది చాలా ధైర్యంతో కూడుకున్న పని అని చెబుతున్నారు. ఆ క్లైమాక్స్ ఏమిటో .. అదెలా వుండనుందో .. సినిమా విడుదలైతేనే గాని తెలిసే అవకాశం లేదు. 

More Telugu News