: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ...ఉగ్రవాదుల్లో లష్కరే చీఫ్?

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదరు కాల్పులు ప్రారంభించాయి. దీంతో రెండు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడంతో వారిలో కీలక నేతలు ఉన్నారని భద్రతాధికారులు అభిప్రాయపడుతున్నారు. లష్కరే తోయిబా చీఫ్ అబూదుజానా ఉన్నాడని భద్రతాబలగాలు చెబుతున్నాయి. ఇప్పటికే లష్కరే కమాండర్ ఆరిఫ్ ను మట్టుబెట్టినట్టు వారు తెలిపారు. 

More Telugu News