: మేమున్నాం... మీరు యుద్ధం మొదలుపెట్టండి: అమెరికాకు జపాన్ సూచన

ఉత్తరకొరియాపై యుద్ధం ప్రారంభిస్తే తాము సహకారం అందిస్తామని జపాన్ ప్రధాని షింజో అబే అమెరికాకు స్నేహహస్తం చాచారు. ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి అమెరికాతో పాటు దక్షిణకొరియా, జపాన్ దేశాలను కూడా ఆందోళనకు గురిచేసింది. ఉత్తరకొరియాకు అమెరికాతో పాటు దక్షిణకొరియా, జపాన్ దేశాలు శత్రు దేశాలు. ఉత్తరకొరియా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా, చైనా దానికి అండగా నిలబడుతుందన్న కారణంతో అమెరికా దాడికి మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తూ, అణ్వాయుధాలు సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో యుద్ధం మొదలుపెట్టండి, సహాయం చేస్తామన్న జపాన్ వ్యాఖ్యలు తమకు ఆనందాన్నిచ్చాయని అమెరికా మీడియా చెబుతోంది.

షింజో అబే ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. అయితే, తమపైకి ఉత్తరకొరియాను చైనా అన్నివిధాలుగా ఎగదోస్తోందని ఆయన చెప్పారు. యుద్ధం కావాలని ఉత్తరకొరియా, చైనాలు భావిస్తే ముందుగా వారి లక్ష్యం దక్షిణకొరియాతో పాటు జపాన్ దేశమేనని ఆయన తెలిపారు. అయితే, అమెరికాను ఎదుర్కొనే శక్తి ఈ రెండు దేశాలకు లేదని తాను భావిస్తున్నానని, యుద్ధానికి ఇదే సరైన తరుణమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.  

More Telugu News