: `భిమ్‌` యాప్ ద్వారా రూ. 1500 కోట్ల లావాదేవీలు జ‌రిగాయి: మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌

స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించే `భిమ్ (భార‌త్ ఇంట‌ర్‌ఫేస్ ఫ‌ర్ మ‌నీ)` అప్లికేష‌న్‌ను రెండు కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని, దీని ద్వారా 50 లక్ష‌ల లావాదేవీల‌తో రూ. 1500 కోట్లు బ‌ట్వాడా అయ్యాయ‌ని కేంద్ర ఐటీ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. జీరో అవ‌ర్ స‌మ‌యంలో స‌మాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు జ‌యా బ‌చ్చ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. డిజిట‌ల్ లావాదేవీల‌కు బాట‌లు వేసే క్ర‌మంలో ప్ర‌భుత్వం దేశ ప్ర‌జ‌ల్ని అయోమ‌యానికి గురిచేస్తోంద‌ని, దీనిపై స‌మాధానం ఏంట‌ని జ‌యా బ‌చ్చ‌న్ ప్ర‌శ్నించారు. యాప్ లావాదేవీలు ప‌క్క‌న పెడితే గ్రామీణ ప్రాంతాల్లో అవ‌స‌రానికి త‌గిన డిజిట‌ల్ లావాదేవీలు అందించే కేంద్రాలు గానీ, ప‌రిక‌రాలు గానీ లేవ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

More Telugu News