sukumar: ఇప్పటికీ బన్నీ నన్ను ఏడిపిస్తుంటాడు!: సుకుమార్

దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించాలని తాను అనుకోవడానికి కారణం, తనది పక్కా పల్లెటూరు కావడమేనని సుకుమార్ అన్నారు. 'ఆర్య' సినిమా విడుదల తరువాత ఒకసారి బన్నీ తన వూరు వచ్చాడని .. సరైన రోడ్డు .. బస్సు సౌకర్యం లేని తన ఊరును చూసి బన్నీ ఆశ్చర్యపోయాడని చెప్పారు.

 అంత పల్లెటూరు నుంచి వచ్చి ఇంత స్టైలీష్ మూవీస్ తెరకెక్కిస్తావా? అంటూ బన్నీ తనని ఇప్పటికీ ఏడిపిస్తూ ఉంటాడని అన్నారు. అంతటి పల్లెటూరు నుంచి వచ్చిన తాను విదేశాల్లో షూటింగులు జరపడం నిజంగా ఆశ్చర్యమేనని చెప్పారు. విదేశాలకి వెళ్లినప్పుడు కూడా అక్కడి హోటల్స్ లో చాప వేసుకుని పడుకుంటాననీ .. అదలా అలవాటైపోయిందని చెప్పుకొచ్చారు.

More Telugu News