: దక్షిణాది సినిమాల సక్సెస్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో స్పందన!

ఈ ఏడాది బాలీవుడ్ కు ఎక్కువగా కలసి రాలేదనే చెప్పుకోవాలి. బద్రీనాథ్ కి దుల్హానియా, హిందీ మీడియం తదితర ఒకటి, రెండు సినిమాలు మినహా బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు లేవనే చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన స్పందనను తెలియజేశాడు. బాలీవుడ్ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడమే దీనికి కారణం కావచ్చని అక్కీ అభిప్రాయపడ్డాడు. దక్షిణాదిలో సినీ పరిశ్రమకు చెందినవారు చాలా సిస్టమాటిక్ గా ఉంటారని చెప్పాడు. పబ్లిసిటీ కోసం దక్షిణాదివాళ్లు రూ. 2 కోట్లకు మించి ఖర్చు చేయరని తెలిపాడు. మంచి సినిమానే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందని చెప్పాడు.

అక్షయ్ కుమార్ నటించిన 'టాయ్ లెట్: ఏక్ ప్రేమ్ కథ' సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో అక్కీ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్ తో తమ సినిమా తెరకెక్కిందని... రూ. 400 కోట్లతో తెరకెక్కిన 'బాహుబలి-2'తో ఈ సినిమాను పోల్చవద్దని, దీన్ని ఓ ప్రత్యేక చిత్రంగానే చూడాలని కోరాడు.

More Telugu News