raviteja: 'రాజా ది గ్రేట్' టీజర్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది!

ప్రస్తుతం రవితేజ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో రవితేజ చూపులేని వ్యక్తిగా కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం. అందువలన ఈ సినిమా టీజర్ కోసం వాళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఆగస్టు 15న టీజర్ ను వదలడానికి ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేస్తోంది.

 టీజర్ తో ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయేలా ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెహ్రీన్ కథానాయికగా అలరించనున్న విషయం తెలిసిందే. వరుస హిట్లతో జోరు చూపిస్తోన్న అనిల్ రావిపూడి, ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.     

More Telugu News