: ఛార్మీని ఝాన్సీ లక్ష్మీ భాయ్ అనకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా?: రాంగోపాల్ వర్మ

'ఛార్మీని ఝాన్సీ లక్ష్మీ భాయ్ అనకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? లేక జొన్నవిత్తుల హ్యాండ్ బుక్ లో రాసి ఉందా?' అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. 'ఝాన్సీ లక్ష్మీ భాయ్ దేశం కోసం పోరాడలేద'ని వర్మ స్పష్టం చేశారు. 'ఝాన్సీ లక్ష్మీ భాయ్ 1857 లో తన సామ్రాజ్యం కోసం పోరాడింద'ని అన్నారు. అయినా 'నా ఉద్దేశ్యంలో ఛార్మీ ఝన్సీ లక్ష్మీ భాయ్... అందులో జొన్నవిత్తులకు అభ్యంతరం ఏంటి?... గతంలో ఒకసారి కేసీఆర్, ఇలియానా కంటే అందంగా ఉన్నారని అన్నాను... అది నా ఒపీనియన్... అలాగే ఇప్పుడు జొన్నవిత్తుల ముఖం నాకు మహాత్మాగాంధీ కంటే ఎక్కువ ఇష్టం అంటే వద్దంటారా?... అలా ఎందుకని అంటూ కేసు పెడతారా?' అంటూ ప్రశ్నించారు వర్మ. 

More Telugu News