Balakrishna: 'పైసా వసూల్' రిలీజ్ డేట్ వచ్చేసింది!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'పైసా వసూల్'!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాలలోను ఎన్నో అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ చేసిన స్టంపర్ కి విశేషమైన ఆదరణ లభించింది. యూ ట్యూబ్ లో ఇది అనూహ్యమైన హిట్స్ తో దూసుకుపోతోంది. కాగా, ఈ 'పైసా వసూల్' చిత్రాన్ని సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ తో కూడిన ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో శ్రియా కథానాయికగా నటించింది. 

More Telugu News