: రాజమౌళి కుమారుడు కార్తికేయ మోసం చేశాడు: డ్రోన్ల తయారీ కంపెనీ ఆరోపణ

డ్రోన్లను తయారు చేస్తున్న ఓ సంస్థ యజమాని దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తాము తీస్తున్న సినిమాకు డ్రోన్లు కావాలంటూ కబురు పెట్టించిన ఆయన, తనతో పని చేయించుకున్నాడని, ఆపై డ్రోన్లను వారి వద్దే పెట్టుకుని, వాటిని ఇవ్వలేదని, తనకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు.

తన పేరును చెప్పేందుకు మాత్రం నిరాకరించిన ఆయన, తన వద్ద ఉన్న డ్రోన్లను సినిమా చిత్రీకరణకు అనుగుణంగా మార్చి, వాటిని పరీక్షించేందుకు సమయం పడుతుందని ముందుగానే తెలిపానని, 9 రోజుల పాటు పని చేసిన తరువాత, ప్రాజెక్టు నుంచి తనను తప్పించిన కార్తికేయ, చివరకు తానిచ్చిన డ్రోన్లను వారివద్దే పెట్టుకుని వేధించారని ఆరోపించారు. తనకు ఇంకా రూ. 2 లక్షల రూపాయలను వారు ఇవ్వాల్సి వుందని అన్నారు. కాగా, కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వారాహి సంస్థ నాగచైతన్య హీరోగా 'యుద్ధం శరణం' సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే ఈ ఘటన జరిగిందని సదరు డ్రోన్ల కంపెనీ యాజమాని వాదిస్తున్నాడు.

More Telugu News