: సచిన్ మరో రికార్డు మాయం... పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో చేరిన కొత్త రికార్డిది

ఎలాంటి పిచ్ అయినా, సులువుగా పరుగులు సాధించగలడని పేరు తెచ్చుకున్న భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. విదేశాల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత క్రికెట్ రికార్డు ఇప్పటివరకూ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా, దాన్ని కోహ్లీ తిరగరాశాడు. సచిన్ 19 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేయగా, కోహ్లీ దాన్ని 17 ఇన్నింగ్స్ ల్లోనే అందుకున్నాడు.

కోహ్లీకన్నా ముందు గ్యారీ సోబర్స్ (13), అలిస్టర్ కుక్ (14), బాబ్ సింప్సన్ (16) ముందున్నారు. ఇటీవలే కోహ్లీ, ఛేజింగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా సచిన్ రికార్డును అధిగమించిన సంగతి తెలిసిందే. 232 ఇన్నింగ్స్ లు ఆడిన సచిన్ ఛేజింగ్ లో 17 సెంచరీలు సాధించగా, 102 వన్డేల్లోనే కోహ్లీ 18వ శతకాన్ని కూడా పూర్తి చేయడం గమనార్హం. ప్రస్తుతం అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో 50కి పైగా సగటును కలిగివున్న ఏకైక క్రికెటర్ కూడా కోహ్లీయే కావడం గమనార్హం.

More Telugu News