: శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో పడింది 8 వికెట్లే... అయినా భారత్ గెలుపునకు కారణమిది!

గాలేలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై పరుగుల పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కూడా. వాస్తవానికి మూడో రోజే శ్రీలంక ఓటమి ఖరారైంది. అత్యంత క్లిష్టతరమైన 550 పరుగుల లక్ష్యంతో లంకేయులు బరిలోకి దిగారు. భారత బ్యాట్స్ మెన్ వారిని కట్టడి చేశారు కూడా. కరుణరత్నే, డిక్వెలాలు మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.

అయితే, మనవాళ్లు తీసింది 8 వికెట్లు మాత్రమే. అయినా, అంపైర్లు ఇండియా గెలిచినట్టు ప్రకటించారు. దీనికి కారణం, వేలి గాయాల కారణంగా రంగన హెరాత్, గుణరత్నేలు బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో వారిని కూడా అవుట్ గా ప్రకటించి, ఇండియాకు గెలుపును అందించారు అంపైర్లు. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు బరిలోకి దిగని నేపథ్యంలో అవతలి జట్టుకు విజయాన్ని ప్రకటించడం చాలా అరుదు.

More Telugu News