: ఆకాశ్ క్షిపణులకు అంతసీను ఉందా?: పార్లమెంటుకు కాగ్ రిపోర్టు

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణి గురించి ఆసక్తికరమైన అంశాలను పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ బహిర్గతం చేసింది. చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆకాశ్ క్షిపణులను ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించాలని 2010లో కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2013 జూన్ నుంచి 2015 డిసెంబర్ మధ్య కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో బేస్ లను ఏర్పాటు చేసి, ఆకాశ్ స్క్వాడ్రన్ ను ఏర్పాటు చేసి, వాటిని చైనా వైపు గురిపెట్టి ఉంచాలని ఆదేశాలు జారీ చేస్తూ, 3,619 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు.

అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని కాగ్ పేర్కొంది. అందుకు కారణాలను కూడా కాగ్ వివరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణులను డీఆర్డీఏ డిజైన్ చేస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) తయారు చేసింది. అయితే బీఈఎల్ తయారు చేసిన ఆకాశ్ క్షిపణుల్లో మూడింట ఒక వంతు క్షిపణులు ప్రయోగం దశలో విఫలమయ్యాయట. దీంతో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? అన్న అనుమానంతో వాటిని ఏర్పాటు చేయడంలో జాప్యం చేశారని కాగ్ వెల్లడించింది. బేస్ ల నిర్మాణంలో జాప్యం వల్లే ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు జరగలేదని కాగ్ తెలిపింది. 

More Telugu News