: బంగారంపై జీఎస్టీ ప్రభావం... వ్యాపారులకు చుక్కలు చూపిస్తున్న నిబంధనలు

డీమోనిటైజేషన్ తర్వాత అమ్మకాలు బాగా పడిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్న బంగారం వర్తకులకు మరోసారి జీఎస్టీ రూపంలో గడ్డు  సమస్యలు ఎదురయ్యాయి. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన కమోడిటీలను ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించడానికి ఈ వే బిల్లును తీసుకోవాలి. కానీ, ఇలా విలువైన బంగారాన్ని ఒకటికి మించి ప్రాంతాలకు తరలించే అవసరం ఉంటుండడంతో ప్రతీసారీ ఈ వే బిల్లు తీసుకోవడం వారికి భారంగా, తలనొప్పిగా పరిణమించింది. దీంతో ఈ వే బిల్లు విలువ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచాలని వర్తకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News