: మరో క్షిపణి ప్రయోగం చేసిన ఉత్తర కొరియా.. అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కిమ్ జాంగ్

ఎన్ని హెచ్చరికలు వస్తున్నా ఖాతరు చేయని ఉత్తర కొరియా... తన దుస్సాహసాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ నెలలోనే రెండు క్షిపణి పరీక్షలను నిర్వహించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ నెల 4న ఓ బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తర కొరియా... నిన్న మరో బాలిస్టిక్ మిస్సైల్ ను పరీక్షించింది. ఈ విషయాన్ని స్వయానా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు అమెరికా మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చిందని... అమెరికాలోని ఏ భాగంపైనైనా తాము దాడి చేయగలమని హెచ్చరించారు. మరోవైపు, ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిన తమ వారిని కిమ్ ప్రశంసల్లో ముంచెత్తారు. మరోవైపు, ఉత్తర కొరియా చర్యలపై అమెరికా మండిపడింది. ఇది చాలా అపాయకరమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉత్తర కొరియాను ఏ ఒక్క సమస్య నుంచి కూడా రక్షించేది లేదని చెప్పింది.

More Telugu News