prabhas: ప్రభాస్ తో మరో మూవీ ప్లాన్ చేస్తోన్న రాజమౌళి?

ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆయన 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి. ఆ తరువాత ప్రభాస్ చేసే ప్రాజెక్టు రాజమౌళితోనేననే టాక్ వినిపిస్తోంది.

 రాజమౌళి తన తదుపరి సినిమాకి పూర్తిస్థాయి కథను సిద్ధం చేసుకునే పనిలో వున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఆయన ప్రభాస్ తో మరో సినిమా చేయనున్నాడట. ఆల్రెడీ స్టోరీ లైన్ కూడా రెడీగానే ఉందనీ .. కమర్షియల్ పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. ఎవరి ప్రాజెక్టులు వారు పూర్తి చేయగానే .. ఇద్దరూ కలిసి మరో సంచలనానికి తెరతీయనున్నారనే వార్త బలంగానే వినిపిస్తోంది.

More Telugu News