dhanush: ఫ్లాప్ సినిమాను రీమేక్ చేస్తానంటోన్న ధనుష్!

కథానాయకుడిగా .. నిర్మాతగా .. దర్శకుడిగా ధనుష్ రాణిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'విఐపి 2' చిత్రం తెరకెక్కింది. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడాడు.

 మాటల్లో మాటగా .. హిందీలో రణబీర్ కపూర్ చేసిన 'బర్ఫీ' చిత్రమంటే తనకి ఎంతో ఇష్టమని చెప్పాడు. చెవిటి .. మూగవానిగా ఈ సినిమాలో రణబీర్ కపూర్ అద్భుతంగా నటించాడని అన్నాడు. తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేయాలనుందనీ .. కుదిరితే రణబీర్ కపూర్ పాత్రను తానే చేస్తానని చెప్పాడు. 2012లో వచ్చిన ఈ సినిమా .. నటుడిగా రణబీర్ కపూర్ కి పేరు తెచ్చిపెట్టింది గానీ, పరాజయాన్ని చవి చూసింది. అలాంటి సినిమాను ధనుష్ రీమేక్ చేస్తాననడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

More Telugu News