: ఫిర్యాదులో విక్రమ గౌడ్ భార్య షిఫాలీ తప్పుడు సమాచారం... దర్గా అన్నదానం అవాస్తవమని తేల్చిన పోలీసులు!

తన భర్త విక్రమ్ గౌడ్ పై హత్యాయత్నం జరిగిందని ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆయన భార్య మూల షిఫాలీ, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం దర్గా వద్ద అన్నదానం చేయాల్సి వున్నందున తాము అర్థరాత్రి 2.30 గంటల సమయంలో నిద్ర లేచామని షిఫాలీ వెల్లడించగా, అసలు దర్గా వద్ద అన్నదాన కార్యక్రమమే లేదని పోలీసులు తేల్చారు. దర్గా వద్ద అలాంటి సందడి లేకపోగా, జరిగిన కాల్పుల ఘటనపై తొలుత ఆమెనే ఇంటరాగేట్ చేయాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

అన్నదాన కార్యక్రమం ఉంటే, ముందే ప్రచారం జరిగి వుంటుందని, పేదలు తరలి వచ్చుండేవారని పోలీసుల అభిప్రాయం. ఇక దర్గా వద్ద ఉన్న పలు టీవీ చానళ్లు, అక్కడ నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలను ప్రసారం చేస్తున్నాయి. అక్కడున్న దర్గా ఇన్ చార్జ్ లు సైతం తమకు అన్నదానంపై ఎటువంటి సమాచారం లేదని చెబుతుండటం గమనార్హం. ఇక జూబ్లీహిల్స్ లో ఉన్న దర్గా కాకుండా, మరెక్కడైనా అన్నదాన ఏర్పాట్లు చేశారా? అన్న విషయంలోనూ ఆమెను ప్రశ్నిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 

More Telugu News