sampoornesh babu: అంచనాలు తలక్రిందులు చేసిన సంపూకి క్రేజ్ తగ్గనుందా?

సంపూ చేసినవి చిన్న సినిమాలే అయినా ఆయనని అభిమానించేవారి సంఖ్య ఎక్కువగానే వుంది. ఆ అభిమానమే ఆయన సినిమాలాడే థియేటర్స్ దగ్గర సందడి చేయిస్తుంది. అలాంటి సంపూ 'బిగ్ బాస్' షోకి వెళ్లడం పట్ల వాళ్లంతా హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆ షోకి ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడనీ .. తనదైన శైలిలో సందడి చేస్తాడని అంతా ఆశించారు. ఈ షో తరువాత ఆయన క్రేజ్ మరింత పెరుగుతుందని భావించారు.

కానీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ మధ్యలోనే సంపూ ఈ షో నుంచి బయటికి వచ్చేశాడు. దాంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. ఈ షోలో సంపూ వ్యవహార శైలి .. అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ షో నుంచి బయటికి వచ్చిన తీరు వలన, ఆయనకి గల  క్రేజ్ తగ్గే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.   

More Telugu News