dulkar salman: 'కాళి' డబ్బింగ్ సినిమాతో సాయిపల్లవి!

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా సాయిపల్లవి గురించే మాట్లాడుకుంటున్నారు. సహజమైన ఆమె నటన 'ఫిదా'లో 'భానుమతి' పాత్రను నిలబెట్టిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడియన్స్ లో ఈ అమ్మాయి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో, చాలామంది దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు. తమ తదుపరి సినిమాల్లో చేయమంటూ భారీ ఆఫర్స్ ఇస్తున్నారు.

 ఈ నేపథ్యంలో మలయాళంలో సాయిపల్లవి చేసిన సినిమాలను అనువాదాలుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మలయాళంలో 'ప్రేమమ్' తరువాత సాయిపల్లవి 'కాళి' అనే సినిమా చేసింది. దుల్కర్ సల్మాన్ సరసన ఆమె చేసిన ఈ సినిమా కూడా అక్కడ విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన ఆ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఓ డిస్ట్రిబ్యూటర్ సన్నాహాలు చేస్తున్నాడు. ఆ సినిమా ఇక్కడి ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News