: అమిత్ షాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేసిన కేసీఆర్!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన వేళ, తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు ఇవ్వని డబ్బులు ఇచ్చినట్టు చెప్పారని, తాము పన్నుల రూపంలో రూ. 52 వేల కోట్లను కేంద్రానికి ఇస్తుంటే, తమ వంతు రావాల్సిన వాటాగా రూ. 25 వేల కోట్లను మాత్రమే ఇస్తున్నారని, అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.

అయితే, దీనిపై వివరణ ఇచ్చిన ప్రధాని మోదీ, తెలంగాణ పర్యటన తరువాత అమిత్ షా తన వద్దకు వచ్చారని, తానేమీ తప్పుగా మాట్లాడలేదని చెప్పారని సర్ది చెప్పినట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. "మీ దగ్గర అన్ని లెక్కలూ ఉన్నాయిగా?" అని మోదీ ప్రశ్నించగా, ప్రజలకు నిజాలు చెప్పాల్సిన వారే అవాస్తవాలు ఎలా చెబుతారని కేసీఆర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News