: ట్రంప్ అనుమతి ఇస్తే చైనాపై వచ్చేవారమే అణుదాడి!: అమెరికా ఫసిఫిక్ రేంజ్ కమాండర్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా ఫసిఫిక్ రేంజ్ కమాండర్ ఆడమ్ స్కాట్ స్విఫ్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో జరిగిన సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇస్తే చైనాపై వచ్చే వారమే అణుదాడికి దిగుతామని సంచలన ప్రకటన చేశారు. ఆయన ఆదేశాల కోసం చూస్తున్నామని, లేకుంటే ఎప్పుడో పని కానిచ్చేసే వారమని ఆయన చెప్పారు.

తన పరిధులు దాటి ఆస్ట్రేలియాలోని క్విన్స్‌ ల్యాండ్‌ తీరంలోకి యుద్ధనౌకలను పంపి వారం క్రితం కవ్వింపులకు దిగిన చైనా, రెండు రోజుల క్రితం అమెరికా నిఘా విమానానికి సమీపంలోకి యుద్ధ విమానాలను పంపి దానిని పేల్చివేసే కుట్రపన్నిందని అన్నారు. చైనా దూకుడును ఇక ఎంతమాత్రమూ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి అమెరికన్ సైనికుడు దేశరక్షణకు కట్టుబడి ఉన్నాడని చెప్పిన ఆయన, అమెరికా, దాని మిత్ర దేశాలను లక్ష్యం చేసుకున్నవారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఉత్తరకొరియాతో తలబొప్పికడుతున్న నేపథ్యంలో చైనాతో కయ్యానికి దిగడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తమవుతోంది. 

More Telugu News