ntr: 'బిగ్ బాస్'రేటింగ్స్ తో దూసుకెళ్లిన స్టార్ మా!

'స్టార్ మా' ఛానల్ లో ఇటీవలే 'బిగ్ బాస్' షో ప్రారంభమైంది. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ రియాలిటీ షోపై ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆసక్తి తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇక వారంలో ఒకటి .. రెండు ఎపిసోడ్స్ కాస్త డల్ గా అనిపించినా, ఎన్టీఆర్ రాకతో కార్యక్రమం మళ్లీ పుంజుకుంటోంది.

ఈ షో నుంచి ఎవరు .. ఎప్పుడు .. ఏ కారణం చేత బయటికి వెళ్లిపోతారోననేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉండటంతో, రికార్డు స్థాయిలో రేటింగ్స్ పెరిగిపోతున్నాయి. వారమంతా వచ్చే ఎపిసోడ్స్ కి 10.4+ టీఆర్పీ వస్తే .. వారాంతంలో ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్ కి 16.1+ టీఆర్పీ వచ్చింది. దాంతో 29వ వారానికి గాను స్టార్ మా రేటింగ్స్ అమాంతంగా పెరిగిపోయి .. ఆ వారానికి ఛానల్ ను ఫస్టు ప్లేస్ లో నిలబెట్టాయి. తెలుగులో ఒక రియాలిటీ షోకి ఈ స్థాయిలో రేటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు.

ntr

More Telugu News