: ప్రజలేమీ ఫూల్స్ కాదు... నితీశ్ పెను తుఫానులో కొట్టుకుపోతారు: తేజస్వీ యాదవ్ నిప్పులు

బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ పై విరుచుకుపడ్డారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పెడుతూ విమర్శలు గుప్పించారు. బీహార్ ప్రజలేమీ ఫూల్స్ కారని, వారి నుంచి వచ్చే నిరసనలు పెను తుఫానుగా మారి, అందులో నితీశ్ కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. దళితులు, ఓబీసీలు, ఈబీసీలు అధికంగా ఉన్న రాష్ట్రం కాబట్టే, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు గత ఎన్నికల్లో ఓట్లు లభించలేదని, ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి, ఇప్పుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం నితీశ్ పాకులాడుతున్నాడని అభిప్రాయపడ్డారు. అవకాశవాద రాజకీయాలను ప్రజలు ఎన్నడూ క్షమించబోరని హెచ్చరించారు. అధికారం కోసం నితీశ్ తొక్కిన అడ్డదారులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తను చేస్తున్న కృషికి ప్రజల్లో అమితమైన గుర్తింపు వచ్చిందని, దాన్ని తట్టుకోలేకనే నితీశ్, తనను తొలగించాలని చూశారని, అది కుదరక, ఇప్పుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అడుగులు వేశారని నిందించారు.

More Telugu News