: నువ్వింకెందుకు వేస్ట్... వెళ్లి దేశవాళీ క్రికెట్ ఆడుకో: అభినవ్ ముకుంద్ పై నెటిజన్ల విమర్శల వర్షం

అవకాశాలు అన్ని వేళలా అందరికీ రావు. ఒకసారి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతే, ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రికెట్ లో. భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ కు గాయం కావడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అభినవ్ ముకుంద్ ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా జట్టులో స్థానం కోసం పోటీ అత్యధికంగా ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి అవకాశం రావడం అదృష్టమే. ఇక అందివచ్చిన అవకాశాన్ని ముకుంద్ వినియోగించుకోలేక పోయాడు. నిన్న ఓపెనర్ గా బరిలోకి దిగిన ముకుంద్, కేవలం 11 పరుగులకే పరిమితం అయ్యాడు. పిచ్ బ్యాటింగ్ కు ఎంతో సహకరిస్తున్న వేళ, అనవసరపు షాట్ ఆడి ముకుంద్ విఫలం కావడంపై క్రీడాభిమానులు విరుచుకుపడుతున్నారు.
అభినవ్ ముకుంద్ కు టెస్టు జట్టులో స్థానం వృథా అని, ఆయన వెళ్లి దేశవాళీ క్రికెట్ ఆడుకోవచ్చని ఎద్దేవా చేస్తున్నారు. టెస్టు కెరీర్ ను ముగించాలని విమర్శలు గుప్పిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయిన ముకుంద్ కు మరోసారి చాన్స్ ఇవ్వవద్దని సూచిస్తున్నారు. ముకుంద్ కంటే మంచి ఓపెనర్లు ఎంతో మంది క్యూలో ఉన్నారని ఒకరు, శ్రీలంక జాతీయగీతం సాగినంత సేపు కూడా ముకుంద్ క్యూలో నిలుచోలేకపోయాడని మరొకరు, పలుమార్లు విఫలమైనా, ఎందుకు అభినవ్ కు చాన్సిస్తున్నారని ఇంకొకరు... ఇలా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

More Telugu News