poorna: సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా 'సువర్ణ సుందరి'

ఈ మధ్యకాలంలో చరిత్రకి సంబంధించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని .. విజయాలను అందుకున్నాయి. ఆ కోవలో తెరకెక్కిన మరో సినిమాయే 'సువర్ణ సుందరి'. 'చరిత్ర ఎప్పుడూ భవిష్యత్ ను వెంటాడుతుంది' అనేది ట్యాగ్ లైన్. ఎం. ఎల్. లక్ష్మి నిర్మాణంలో .. సూర్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 1509లో మొదలయ్యే ఈ కథ 2017 వరకూ కొనసాగుతుంది. నాలుగు దశాబ్దాలకి సంబంధించిన కథను ఆవిష్కరించే ఈ సినిమాలో పూర్ణ ప్రధానమైన పాత్రను పోషించింది. 'అరుంధతి' మూవీ అనుష్కకి ఎంతటి క్రేజ్ ను తెచ్చిపెట్టిందో .. ఈ సినిమా పూర్ణకి అంతటి పేరును తీసుకువస్తుందని చెబుతున్నారు. త్వరలోనే టీజర్ ను వదలనున్నామనీ .. విడుదల తేదీని తెలియజేస్తామని అన్నారు.

More Telugu News