: ఢిల్లీ ప్రజల ప్రాణాలను ఎక్కువగా బలిగొంటున్నవి ఇవే!

దేశ రాజధాని ఢిల్లీలో బీపీ, మధుమేహం వ్యాధులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. హై బీపీ వల్ల హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్స్ కు అత్యధికులు గురవుతున్నారు. ప్రజా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2015లో బీపీ వల్ల 3,890 మంది, డయాబెటీస్ వల్ల 1,356 మంది ప్రాణాలు కోల్పోయారనే చేదు నిజం ఈ సర్వేలో వెల్లడైంది. 2015లో ఢిల్లీలో బీపీ కేసులు 3,22,510గా ఉంటే... ఈ సంఖ్య 2016 నాటికి 3,61,510కి పెరిగింది.

ఇతర రోగాల వల్ల మరణించేవారి కంటే బీపీ, డయాబెటీస్ వల్ల మరణించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. వీటి వల్ల మరణిస్తున్నవారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతోందని ప్రజా ఫౌండేషన్ వెల్లడించింది. 

More Telugu News