: వేలానికి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అరుదైన చిత్రం

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు చెందిన ఓ అరుదైన చిత్రాన్ని వేలం వేయబోతున్నారు. అమెరికా సంస్థ 'నేట్ డీ శాండర్స్' ఈ చిత్రాన్ని వేలం వేయనుంది. ఈ ఫొటోలో నాలుకను బయటపెట్టి, చాలా సరదాగా ఐన్ స్టీన్ కనిపిస్తారు. ఈ చిత్రానికి రూ. 64.36 లక్షల వరకు ధర పలికే అవకాశం ఉందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఫొటోలో ఐన్ స్టీన్ తో పాటు ఆనాటి ప్రిన్స్ టన్ అడ్వాన్స్ డ్ స్టడీ ఇన్స్టిట్యూట్ అధిపతి ఫ్రాంక్ ఎడిలోట్, ఆయన సతీమణి ఉన్నారు. ఎడమవైపున ఐన్ స్టీన్ సంతకం కూడా ఉంది.  

More Telugu News