mahesh: రొమాంటిక్ సాంగ్ కోసం రొమేనియాకి మహేశ్, రకుల్!

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తోన్న 'స్పైడర్' సినిమా .. ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ పాటను 'రొమేనియా'లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మహేశ్ బాబు .. రకుల్ పై ఈ రొమాంటిక్ సాంగ్ ఉండనుంది.

 సంగీత సాహిత్యాలతో పాటు, ఇక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లోని దృశ్యాలు ఈ పాటను హైలైట్ గా నిలుపుతాయని చెబుతున్నారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఈ పాటను తెరకెక్కించనున్నారు. ఇక ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ టీజర్ కోసమే మహేశ్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More Telugu News