: నాకు ఇష్టమైన నెలలోనే అఖిల్ సినిమా విడుదల చేస్తాం: నటుడు నాగార్జున
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున తన కొడుకు సినిమా గురించి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘అన్నపూర్ణ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న అఖిల్ సినిమాలోని కొంత రషెస్ చూశాను. నాకు ఇష్టమైన నెల డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నాం’ అని నాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన రెండు ఫొటోలను నాగార్జున పోస్ట్ చేశారు. కాగా, అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నదీ ప్రకటించలేదు.