ntr: 'జై లవ కుశ'లో ఎన్టీఆర్ డాన్స్ అదరగొట్టేస్తున్నాడట!

బాబీ దర్శకత్వంలో 'జై లవకుశ' చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పూణేలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడి ప్యాలెస్ లో నాయకా నాయికలపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్ ను అదరగొట్టేస్తున్నాడని బాబీ అన్నాడు.

డాన్స్ ను అంత అద్భుతంగా చేయగలగడం ఎన్టీఆర్ కి ఒక వరం .. ఆయన డాన్స్ ను ప్రత్యక్షంగా చూడటం తన అదృష్టమని బాబీ చెప్పాడు. ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ చూసిన వాళ్లెవరైనా ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పకుండా వుండలేరని అన్నాడు. ఈ డాన్స్ .. సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాడు. దసరాకి ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సమయం కోసమే ఎన్టీఆర్ అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

More Telugu News